Theme:
ఉచితంగా ఇసుక రూ.200 కోట్ల ఆదాయం కోసం ఇంత హంగామా అవసరం లేదు. విక్రయ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల చట్టం కిందకు తెద్దాం సరిహద్దు దాటితే భారీ జరిమానా. సత్వరం విధివిధానాలు ఖరారు .
---మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు
Story:
కొన్నేళ్లనుంచి ఇసుక కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న కష్టాలకు చెల్లుచీటీ. ఇసుక ధర తగ్గించడం కాదు... ఏకంగా ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు ఇసుక రేవులు, వేలంపాటలు ఇలా ఏ విధానం తెచ్చినా ప్రజలకు మాత్రం కష్టాలు తప్పలేదని భావించిన చంద్రబాబు చివరకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలనుకున్నారు. రాష్ట్ర మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాత్రి వీడియో సమావేశం నిర్వహించారు. ఇసుక అంశంపై నిర్వహించిన ఈ సమావేశంలో చంద్రబాబు హఠాత్తుగా.. ఇసుకను ఉచితంగా ఇచ్చేద్దామని పేర్కొన్నారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చూస్తూ ఉండడం సరికాదని, ఇసుకను ఉచితంగా ఇచ్చేద్దామని స్వయంగా చెప్పారు. ఇసుకపై వచ్చేది రూ.200 కోట్లు మాత్రమేనని, దీనికోసం ఇంత హంగామా అవసరమా? అని ప్రశ్నించారు. జీపీఎస్ పద్ధతి, సీసీ కెమెరాలు, పర్యవేక్షణకు ఇంతమంది అధికారులను పెట్టడం అవసరమా? అని చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇళ్లు, భవనాల నిర్మాణాలకు, ప్రభుత్వ పనులకు అన్నింటికీ ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇకపై నిర్మాణ పనులన్నింటికీ ఇసుకను ఉచితంగా ఇస్తారు. ప్రజలు రవాణా ఖర్చు మాత్రమే భరించాల్సి ఉంటుంది. ఇసుకను నిత్యావసర వస్తువుల జాబితాలోకి తెద్దామని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం. అక్రమంగా నిల్వ చేయడం, సరిహద్దులు దాటించడం, సిండికేట్లుగా ఏర్పడి రేవులపై ఆధిపత్యం చలాయించాలని ప్రయత్నించడం ఇలాంటి వాటన్నింటినీ నేరంగా పరిగణిస్తారు. చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ప్రకటించి సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల స్పందన కోరారని సమాచారం. వారంతా ఇది మంచి నిర్ణయమని, ప్రజలకు మేలు చేసేదని అన్నట్లు సమాచారం. జిల్లాల కలెక్టర్లు కూడా ఇది మంచి నిర్ణయమన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ...‘సార్! ఇప్పటివరకు ఇసుకపై ప్రజలకు ఏం చెప్పాలో తెలియక తలబొప్పి కట్టింది. మంచి నిర్ణయం తీసుకున్నారు. దటీజ్ చంద్రబాబు’ అన్నట్లు సమాచారం.

Comments
Post a Comment