Skip to main content

Posts

Showing posts from February, 2016

ఫ్రీడమ్‌ రూ.251 స్మార్ట్‌ఫోన్ డబ్బులు వెనక్కి

న్యూఢిల్లీ : చౌక స్మార్ట్‌ఫోన్ (రూ.251) ఫ్రీడమ్‌పై వివాదం నేపథ్యంలో..  ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి డబ్బును వాపసు చేసినట్లు వెల్లడించింది ఫోన్ తయారీ సంస్థగా చెప్పుకుంటున్న రింగింగ్ బెల్స్. ముందుగా డబ్బులు చెల్లించి  బుక్ చేసుకున్న 30,000 మందికి నగదు తిరిగి ఇచ్చేసినట్లు కంపెనీ ఎండీ మోహిత్ గోయల్ తెలిపారు. ఆర్డరు చేసిన వారికి క్యాష్ ఆన్ డెలివరీ కిందే ఫోన్లను అందిస్తామన్నారు.

ఉచితంగా ఇసుక

        Theme: ఉచితంగా ఇసుక     రూ.200 కోట్ల ఆదాయం కోసం ఇంత హంగామా అవసరం లేదు.    విక్రయ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.    నిత్యావసరాల చట్టం కిందకు తెద్దాం    సరిహద్దు దాటితే భారీ జరిమానా.    సత్వరం విధివిధానాలు ఖరారు  . ---మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు   Story: కొ న్నేళ్లనుంచి ఇసుక కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పడుతున్న కష్టాలకు చెల్లుచీటీ. ఇసుక ధర తగ్గించడం కాదు... ఏకంగా ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు ఇసుక రేవులు, వేలంపాటలు ఇలా ఏ విధానం తెచ్చినా ప్రజలకు మాత్రం కష్టాలు తప్పలేదని భావించిన చంద్రబాబు చివరకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలనుకున్నారు. రాష్ట్ర మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాత్రి వీడియో సమావేశం నిర్వహించారు. ఇసుక అంశంపై నిర్వహించిన ఈ సమావేశంలో చంద్రబాబు హఠాత్తుగా.. ఇసుకను ఉచితంగా ఇచ్చేద్దామని పేర్కొన్నారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చూస్తూ ఉండడం సరికాదన...