Theme: ఉచితంగా ఇసుక రూ.200 కోట్ల ఆదాయం కోసం ఇంత హంగామా అవసరం లేదు. విక్రయ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల చట్టం కిందకు తెద్దాం సరిహద్దు దాటితే భారీ జరిమానా. సత్వరం విధివిధానాలు ఖరారు . ---మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు Story: కొ న్నేళ్లనుంచి ఇసుక కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న కష్టాలకు చెల్లుచీటీ. ఇసుక ధర తగ్గించడం కాదు... ఏకంగా ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు ఇసుక రేవులు, వేలంపాటలు ఇలా ఏ విధానం తెచ్చినా ప్రజలకు మాత్రం కష్టాలు తప్పలేదని భావించిన చంద్రబాబు చివరకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలనుకున్నారు. రాష్ట్ర మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాత్రి వీడియో సమావేశం నిర్వహించారు. ఇసుక అంశంపై నిర్వహించిన ఈ సమావేశంలో చంద్రబాబు హఠాత్తుగా.. ఇసుకను ఉచితంగా ఇచ్చేద్దామని పేర్కొన్నారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చూస్తూ ఉండడం సరికాదన...