Skip to main content

నిషిత్ మరణం.. కుటుంబ సభ్యులతో నారాయణ ఏమన్నారంటే..


నారాయణ:

‘‘మన చేతిలో ఏమీ లేదు.. చేయగలిగిందీ లేదు.. ఇప్పుడు ఏముంది.. జరగాల్సింది జరిగి పోయింది..’’ అంటూ మంత్రి నారాయణ కన్నీటిని దిగమింగుతూ మనో దైర్యాన్ని పాటించారు. చేతికందిన కొడుకును అకాల మృత్యువు కబళించడంతో నారాయణను ఎలా సముదాయించాలో అని అంతా దిగులు పడ్డారు. అయితే, 23 గంటల ప్రయాణం అనంతరం కుమారుడి మృతదేహాన్ని చూసిన నారాయణ 20 నిమిషాల పాటు తనలోనే తాను రోదిస్తూ మౌనంగా నిలబడ్డారు. ఆ తర్వాత బాధనంతా దిగమింగుకుని ధైర్యంగా కనిపించారు. ఆయన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఎంతటి మనో ధైర్యం.. అంటూ చర్చించుకున్నారు. ఎందరో ప్రముఖులు నిషిత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కన్నీరు పెట్టుకున్నారు.

Comments